ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి గోదావరి నది వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ముంపు ప్రాంతాల్లో నివసించే ప్రజలను వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు.

👉 ముంపు ప్రాంతాలకు నిత్యవసర వస్తువులు పంపిణీ కార్యక్రమం తక్షణం చేపట్టాలని ఆదేశాలు ఇచ్చారు.
👉 గర్భిణీలు, పిల్లలు, వికలాంగులను ముందుగా సురక్షిత ప్రాంతాలకు తరలించాలి.
👉 గోదావరి పరివాహక గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.

ప్రజల భద్రతా చర్యలపై అధికారుల దృష్టి ప్రత్యేకం.