ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. శిక్షణ పూర్తి చేసుకున్న 2023 బ్యాచ్‌కి చెందిన ఏడుగురు ఐఏఎస్ ప్రొబేషనరీ అధికారులకు సబ్ కలెక్టర్లుగా పోస్టింగ్‌ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ విడుదల చేశారు. ఈ నెల 11న విధుల్లో చేరాలని ఆదేశాలు జారీ అయ్యాయి.

కొత్తగా నియమితులైన సబ్ కలెక్టర్లు – జిల్లాల వారీగా వివరాలు:

🔹 మదనపల్లె సబ్ కలెక్టర్ – చల్లా కల్యాణి
(వై. మేఘస్వరూప్ బదిలీ)

🔹 కందుకూరు రెవెన్యూ సబ్ డివిజన్ – దామెర హిమవంశీ
(తిరుమాని శ్రీపూజ బదిలీ)

🔹 పాలకొండ సబ్ డివిజన్ – పవార్ స్వప్నిక్ జగన్నాథ్
(సి. యశ్వంత్ కుమార్ రెడ్డి బదిలీ)

🔹 నూజివీడు సబ్ కలెక్టర్ – బొల్లిపల్లి వినూత్న
(బచ్చు స్మరణ్ రాజ్ బదిలీ)

🔹 రాజంపేట సబ్ కలెక్టర్ – హెచ్.ఎస్. భావన
(వైకోమ్ నైదియా దేవి బదిలీ)

🔹 రంపచోడవరం సబ్ కలెక్టర్ – శుభం నొఖ్వాల్
(కల్పశ్రీ కె.ఆర్. బదిలీ)

🔹 పార్వతీపురం సబ్ కలెక్టర్ – ఆర్. వైశాలి
(అశుతోష్ శ్రీవాత్సవ బదిలీ)