దుబాయ్ వేదికగా జరుగుతున్న సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (SIIMA) 2025లో తెలుగు సినిమాలు ఘన విజయాన్ని సాధించాయి. ముఖ్యంగా పుష్ప 2, కల్కి 2898 ఏడీ సినిమాలు అవార్డుల వర్షం కురిపించాయి.
సౌత్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ఈ అవార్డులు ప్రతీ సంవత్సరం సినీ ప్రతిభను గుర్తించి సత్కరిస్తాయి. ఈసారి మొదటి రోజు కన్నడ, తెలుగు విభాగాలకు చెందిన అవార్డులను ప్రఖ్యాత సినీ ప్రముఖుల సమక్షంలో ప్రకటించారు.
---
🏆 తెలుగు విజేతల జాబితా:
ఉత్తమ చిత్రం: కల్కి 2898 ఏడీ
ఉత్తమ దర్శకుడు: సుకుమార్ (పుష్ప 2)
ఉత్తమ దర్శకుడు (క్రిటిక్స్): ప్రశాంత్ వర్మ (హను మాన్)
ఉత్తమ నటుడు: అల్లు అర్జున్ (పుష్ప 2)
ఉత్తమ నటి: రష్మిక మందన్నా (పుష్ప 2)
ఉత్తమ నటుడు (క్రిటిక్స్): తేజా సజ్జ (హను మాన్)
ఉత్తమ నటి (క్రిటిక్స్): మీనాక్షి చౌదరి (లక్కీ భాస్కర్)
ఉత్తమ సహాయ నటుడు: అమితాబ్ బచ్చన్ (కల్కి)
ఉత్తమ సహాయ నటి: అన్నా బెన్ (కల్కి)
ఉత్తమ కొత్త నటి: భాగ్యశ్రీ బోర్సే (మిస్టర్ బచ్చన్)
ఉత్తమ సంగీత దర్శకుడు: దేవీ శ్రీ ప్రసాద్ (పుష్ప 2)
ఉత్తమ గేయ రచయిత: రామజోగయ్య శాస్త్రి (దేవర – చుట్టమల్లే)
ఉత్తమ ప్లేబ్యాక్ సింగర్ (ఫీమేల్): శిల్పా రావ్ (దేవర – చుట్టమల్లే)
ఉత్తమ గాయకుడు (మేల్): శంకర్ బాబు కందుకూరి (పుష్ప 2 – పీలింగ్స్)
ఉత్తమ విలన్: కమల్ హాసన్ (కల్కి)
ఉత్తమ సినిమాటోగ్రాఫర్: రత్నవేలు (దేవర)
ఉత్తమ హాస్యనటుడు: సత్య (మత్తు వదలరా 2)
ఉత్తమ కొత్త నిర్మాత: నిహారిక కొణిదెల (కమిటీ కుర్రోళ్లు)
ఉత్తమ కొత్త నటుడు: సందీప్ సరోజ్ (కమిటీ కుర్రోళ్లు)
ఉత్తమ కొత్త దర్శకుడు: నందకిశోర్ ఇమాని (35 చిన్న కథ కాదు)
ప్రైడ్ ఆఫ్ తెలుగు సినిమా: అశ్వినీదత్ (వైజయంతీ మూవీస్ – 50 ఏళ్ల సినీ ప్రయాణం)
---
ఈసారి SIIMA వేదిక తెలుగు సినీ ప్రతిభను మరోసారి ప్రపంచానికి పరిచయం చేసింది. పుష్ప 2తో అల్లు అర్జున్, రష్మిక మందన్నా జంట అవార్డులు గెలుచుకోవడం విశేషం కాగా, కల్కి 2898 ఏడీకు బెస్ట్ ఫిల్మ్గా దక్కడం తెలుగు సినిమా స్థాయి ఎంత ఎత్తుకు చేరిందో నిరూపించింది.