ఎన్నికలలో ఒకే వ్యక్తికి ఒకటికి మించి మంచి టికెట్ ఉండకూడదని ఎన్నికల సంఘం స్పష్టతనిచ్చింది. ఒకే వ్యక్తి రెండు లేదా అంతకంటే ఎక్కువ నియోజకవర్గాల్లో ఒకేసారి గెలిస్తే, ఒక్క నియోజకవర్గాన్ని మాత్రమే కొనసాగించాల్సి ఉంటుందని, మిగతా స్థానాలను తప్పనిసరిగా వదులుకోవాలని ఈసీ తెలిపింది. 1950 నుంచే ఈ నిబంధన అమల్లో ఉన్నదని, గెలిచిన తర్వాత 31 రోజుల లోపు నిర్ణయం తీసుకోకపోతే, ఆ అభ్యర్థి రెండు స్థానాలనూ కోల్పోవాల్సి వస్తుందని స్పష్టం చేసింది.
ఇక, రెండు ఓటరు ఐడీలు కలిగి ఉండటం కూడా చట్ట విరుద్ధమని ఎన్నికల సంఘం మరోసారి హెచ్చరించింది. తెలంగాణ, ఢిల్లీల్లో ఓటరు కార్డులు కలిగి ఉన్నారనే ఆరోపణలపై కాంగ్రెస్ నేత పవన్ ఖేఢా భార్యకు నోటీసులు జారీ చేసింది. దీనిపై 10 రోజులలోగా సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. ఒకటి కంటే ఎక్కువ ఓటరు ఐడీలు కలిగి ఉండటం నేరమని, ఇలాంటి చర్యలు ఎన్నికల ప్రక్రియను దెబ్బతీసే అవకాశం ఉందని ఈసీ స్పష్టం చేసింది.