SSMB 29 తాజా అప్‌డేట్

సూపర్‌ స్టార్ మహేష్ బాబు – పాన్‌ ఇండియా దర్శకుడు రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న SSMB 29 కోసం సినీప్రపంచం అంతా ఆతృతగా ఎదురుచూస్తోంది. భారీ బడ్జెట్, అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ ప్రాజెక్ట్ ప్రస్తుతం కెన్యాలో షూటింగ్ దశలో ఉంది.మరి మహేశ్ లుక్ ఎలా ఉండనందో తెలియాలంటే నవంబర్ దాకా ఆగాల్సిందే!

 

  • రాజమౌళి సినిమాలు రెండు దశాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా సంస్కృతిని చాటి చెప్పాయని,
  • మసాయిమరా, నైవాషా, అంబోసెలి లాంటి కెన్యా అందాలు సినిమాలో ప్రతిబింబించబోతున్నాయని,
  • ఈ ప్రాజెక్ట్ 120 దేశాల్లో విడుదలై 100 కోట్ల మందికిపైగా ప్రేక్షకులను చేరుకునే అవకాశం ఉందని,
  • కెన్యా చరిత్రను, అందాలను ప్రపంచానికి పరిచయం చేసే మైలురాయిగా ఈ సినిమా నిలుస్తుందని పేర్కొన్నారు.

ప్రీ లుక్ పోస్టర్లో –

  • మహేశ్ ఛెస్ట్‌పై రక్తపు గాయం,
  • మెడలో రుద్రాక్షమాల,
  • త్రిశూలం, ఢమరుకం, నంది, శివనామాలు ఉండటం వలన పోస్టర్ ఆధ్యాత్మిక టచ్‌తో ఆకట్టుకుంది.

🔹 ప్రాజెక్ట్ హైలైట్స్

  • కథ: అమెజాన్ అడవుల్లో సాహస యాత్రికుడి నేపథ్యంలో
  • మ్యూజిక్: ఎంఎం కీరవాణి
  • హీరోయిన్: ప్రియాంక చోప్రా
  • బడ్జెట్: ₹800 కోట్లకు పైగా
  • నిర్మాణం: కె.ఎల్. నారాయణ – దుర్గా ఆర్ట్స్

✨ మహేశ్ – రాజమౌళి కాంబో కాబట్టి ఏ చిన్న అప్‌డేట్ వచ్చినా క్షణాల్లో వైరల్ అవుతోంది. ఇక మహేశ్ లుక్ ఎలా ఉండబోతుందో తెలుసుకోవాలంటే నవంబర్ వరకు ఆగాల్సిందే!