గ్రామీణ ప్రజలకు పన్నులు, ఫీజులు చెల్లించే ప్రక్రియను సులభతరం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ‘స్వర్ణ పంచాయతీ పోర్టల్’ను అందుబాటులోకి తెచ్చిందని పశ్చిమ గోదావరి జిల్లా పంచాయతీ అధికారి ఎన్. రామనాథ్ రెడ్డి గారు తెలిపారు.
ఈ పోర్టల్ ద్వారా ప్రజలు ఇంటి పన్నులు (House Taxes), వాటర్ ట్యాప్ ఫీజులు (Water Tap Fees), అలాగే ఇతర స్థానిక పన్నులు/ఫీజులు ఎక్కడి నుండైనా సులభంగా ఆన్‌లైన్‌లో చెల్లించవచ్చని ఆయన వివరించారు.
శ్రీ రామనాథ్ రెడ్డి గారు ప్రజలు మరియు అధికారులు ఇద్దరూ ఈ పోర్టల్ ద్వారానే పన్నులు, ఫీజులు చెల్లించాలని సూచించారు. “ఈ విధానం వలన ప్రజలకు సమయం ఆదా అవుతుంది. పన్నుల వసూళ్లు సకాలంలో పూర్తవుతాయి. పంచాయతీల ఆదాయం పెరగడం వల్ల గ్రామాభివృద్ధి వేగంగా ముందుకు సాగుతుంది” అని అన్నారు.
గ్రామీణ పరిపాలనను డిజిటల్ మార్గంలో బలపరచడమే ఈ పోర్టల్ లక్ష్యమని, ప్రజల్లో మరింత అవగాహన కల్పించాలని అధికారులు కృషి చేయాలని గ్రామీణ ప్రజలకు పన్నులు, ఫీజులు చెల్లించే ప్రక్రియను సులభతరం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం *‘స్వర్ణ పంచాయతీ పోర్టల్’*ను అందుబాటులోకి తెచ్చిందని పశ్చిమ గోదావరి జిల్లా పంచాయతీ అధికారి ఎన్. రామనాథ్ రెడ్డి గారు తెలిపారు.
ఈ పోర్టల్ ద్వారా ప్రజలు ఇంటి పన్నులు (House Taxes), వాటర్ ట్యాప్ ఫీజులు (Water Tap Fees), అలాగే ఇతర స్థానిక పన్నులు/ఫీజులు ఎక్కడి నుండైనా సులభంగా ఆన్‌లైన్‌లో చెల్లించవచ్చని ఆయన వివరించారు.
శ్రీ రామనాథ్ రెడ్డి గారు ప్రజలు మరియు అధికారులు ఇద్దరూ ఈ పోర్టల్ ద్వారానే పన్నులు, ఫీజులు చెల్లించాలని సూచించారు. “ఈ విధానం వలన ప్రజలకు సమయం ఆదా అవుతుంది. పన్నుల వసూళ్లు సకాలంలో పూర్తవుతాయి. పంచాయతీల ఆదాయం పెరగడం వల్ల గ్రామాభివృద్ధి వేగంగా ముందుకు సాగుతుంది” అని అన్నారు.
గ్రామీణ పరిపాలనను డిజిటల్ మార్గంలో బలపరచడమే ఈ పోర్టల్ లక్ష్యమని, ప్రజల్లో మరింత అవగాహన కల్పించాలని అధికారులు కృషి చేయాలని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శ్రీ రామనాథ్ రెడ్డి గారు డిప్యూటీ ఎంపీడీఓ లకు,పంచాయతి సెక్రటరీలకు తగు సూచనలు జారీ చేశారు