పశ్చిమ గోదావరి జిల్లాలోని జుత్తిగ గ్రామంలో ప్రసిద్ధ శైవక్షేత్రం శ్రీ ఉమా వాసుకి రవి సోమేశ్వర స్వామి ఆలయం ప్రధాన మండపంలో ప్రతిష్టించిన వీరభద్ర స్వామివారిపై గురువారం సాయంత్రం సూర్యకిరణాలు ప్రసరించాయి.

సాయంత్రం 5 గంటల 29 నిమిషాల నుండి 5 గంటల 36 నిమిషాల వరకు (మొత్తం 8 నిమిషాలు) స్వామివారి విగ్రహంపై పడ్డ సూర్యకిరణాలను భక్తులు దివ్యదర్శనంగా వీక్షించారు.

ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ర్యాలీ వాసు శర్మ మాట్లాడుతూ “ప్రతి సంవత్సరం ఇదే సమయంలో వీరభద్ర స్వామి మూలవిరాట్‌పై సూర్యకిరణాలు ప్రసరిస్తాయి. ఇది ఆలయ నిర్మాణ వైభవానికి నిదర్శనం” అని తెలిపారు.