పశ్చిమ గోదావరి జిల్లా, తాడేపల్లిగూడెం మండలం, పెంటపాడు గ్రామం, కొనాగర పేట చర్చి సమీపంలో  ఘోర హత్యా సంఘటన చోటు చేసుకుంది. స్థానికులు మరియు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, మేనల్లుడు కెనాధ్ బాబు మద్యపు వ్యసనంతో తన అమ్మ మరియు మేనమామతో తరచుగా గొడవలు పడుతూ ఉండేవాడు.

ఆదివారం అర్ధరాత్రి మద్య సేవించిన తర్వాత కెనాధ్ బాబు తన తల్లితో గొడవ పడుతూ, మేనమామ గిరి బాబు అలియాస్ జానుబాబు (పాస్టర్) తో ఘర్షణకు పాల్పడ్డాడు. ఆ సమయంలో జానుబాబు కత్తితో దాడి చేసి కెనాధ్ బాబును తీవ్రంగా గాయపరిచాడు. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరి కెనాధ్ బాబును తాడేపల్లిగూడెం ఏరియా హాస్పిటల్ కి తరలించారు, కానీ వైద్యులు అతను మృతి చెందినట్లు నిర్ధారించారు.

పోలీసులు వెంటనే జానుబాబును అదుపులోకి తీసుకుని, కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ హత్య నేపథ్యంలో పోలీసులు, కుటుంబ సభ్యులతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో భద్రతా చర్యలు తీసుకున్నారు.