పాలిటెక్నిక్ కళాశాలలకు సొంత భవనాలు నిర్మిస్తున్నాం ...

అడ్మిషన్లు పెంచేందుకు వచ్చేఏడాది నుంచి కొత్త కోర్సులు శాసనసభలో రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అసెంబ్లీలో సమాధానం

  • సొంత భవనాలు
    • రాష్ట్రంలో ఇంకా 10 ప్రభుత్వ పాఠశాలలకు, 2 పాలిటెక్నిక్ కళాశాలలకు సొంత భవనాలు లేవు.
    • కూటమి ప్రభుత్వం వచ్చాక 2 పాలిటెక్నిక్ ల భవనాల పనులు ప్రారంభమయ్యాయి.
    • 5 పాలిటెక్నిక్ లకు (చోడవరం, పొన్నూరు, బేతంచర్ల, మైదుకూరు, గుంతకల్లు) భూములు కేటాయించారు.
    • మరో 3 (మచిలీపట్నం, కెఆర్ పురం, అనపర్తి)కి భూములు కేటాయించాల్సి ఉంది.
    • కేంద్రం, ఎంపి లాడ్స్, సిఎస్ఆర్ నిధులతో భవనాలు పూర్తి చేస్తామని మంత్రి తెలిపారు.
  • కోర్సులు & అడ్మిషన్లు
    • పాలిటెక్నిక్ లలో ప్రస్తుతం అడ్మిషన్లు సుమారు 70% మాత్రమే.
    • కన్వెన్షనల్ కోర్సులకు డిమాండ్ తగ్గిపోవడంతో, కొత్త మార్కెట్ లింక్, జాబ్ ఓరియంటెడ్ కోర్సులు తీసుకురాబోతున్నారు.
    • వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి కొత్త కోర్సులు ప్రవేశపెట్టి మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పిస్తామని మంత్రి లోకేష్ చెప్పారు.
  • ప్రత్యేక ప్రస్తావనలు
    • బి.మఠం నవోదయ స్కూలు తాత్కాలిక భవనాల్లో ప్రారంభించే విషయంలో కేంద్ర మంత్రితో చర్చిస్తామని తెలిపారు.
    • కోనసీమ హయ్యర్ ఎడ్యుకేషన్ లో వెనుకబడి ఉందని గుర్తించారు. అక్కడ ఇప్పటికే ప్రభుత్వ డిగ్రీ కళాశాల మంజూరు చేసినట్లు చెప్పారు. త్వరలో పాలిటెక్నిక్ కూడా పరిశీలిస్తామని అన్నారు.

ఎమ్మెల్యేల సూచనలు

  • పుట్టా సుధాకర్ యాదవ్:
    • మైదుకూరు పాలిటెక్నిక్ కెపాసిటీ 540 seats ఉండగా, కేవలం 120 మంది మాత్రమే చదువుతున్నారు.
    • సొంత భవనం ఏర్పాటవుతే విద్యార్థులకు లాభమని సూచించారు.
    • బ్రహ్మంగారిమఠం నవోదయ స్కూలు తాత్కాలిక భవనంలో ప్రారంభించమని కోరారు.
  • అయితాబత్తుల ఆనందరావు:
    • అంబేద్కర్ కోనసీమలో పాలిటెక్నిక్ లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు.
    • జిల్లా వెనుకబడి ఉందని, ప్రభుత్వ పాలిటెక్నిక్ మంజూరు చేయాలని కోరారు.
  • మద్దిపాటి వెంకటరాజు:
    • 2024-25లో పాలిటెక్నిక్ లలో 94% సక్సెస్ రేటు ఉన్నా, అడ్మిషన్లు తగ్గిపోవడాన్ని ప్రస్తావించారు.
    • అడ్మిషన్లు పెంచితే విద్యార్థులకు మరింత లాభం చేకూరుతుందని అన్నారు.