సంక్షేమమే లక్ష్యం – అసెంబ్లీలో మరో హామీ అమలు చేసిన సీఎం చంద్రబాబు”
సూపర్ సిక్స్, మేనిఫెస్టో హామీల అమలుపై అసెంబ్లీలో సీఎం చంద్రబాబు ప్రసంగం
శాసనసభలో మరో సంక్షేమ కార్యక్రమాన్ని ప్రకటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు.
అక్టోబర్ 4వ తేదీ నుంచి ‘ఆటో డ్రైవర్ల సేవలో’ కార్యక్రమం ప్రారంభం.
"చాలా ఆలోచించి పేదల సేవలో అనే పేరు పెట్టాం" అని సీఎం వ్యాఖ్య.
ప్రతి నెలా పింఛన్లు అందించే కార్యక్రమంలో పాల్గొనడం తనకు సంతృప్తి కలిగిస్తోందని పేర్కొన్నారు.
"టీడీపీ-జనసేన-బీజేపీ కలిసి ఎన్నికలకు వెళ్లి అభివృద్ధి–సంక్షేమం–సుపరిపాలనతో రాష్ట్ర పునర్నిర్మాణం చేస్తామని చెప్పాం... నాడు చెప్పాం, నేడు చేసి చూపుతున్నాం" అని చంద్రబాబు హామీ.
ఆటో, క్యాబ్ డ్రైవర్ల కోసం ప్రతి ఏడాది ₹15,000 ఇస్తామని స్పష్టం.
మొత్తం 2,90,234 మంది డ్రైవర్లు లబ్ధిదారులుగా ఎంపిక.
లబ్ధిదారుల జాబితాలో పేరు లేకపోతే సమస్యలు పరిష్కరించి వారినీ చేర్చుతామని హామీ.
పథకానికి ₹435 కోట్లు ఖర్చు కేటాయింపు.
"గత ప్రభుత్వం రూ.12 వేలే ఇచ్చింది, మేము రూ.15 వేలు ఇస్తున్నాం" అని చంద్రబాబు వ్యాఖ్య.
Admin
September 27, 2025
524
ఆంధ్రప్రదేశ్
ప్రచురించబడింది
ట్యాగ్స్:
సంక్షేమమే లక్ష్యం – అసెంబ్లీలో మరో హామీ అమలు చేసిన సీఎం చంద్రబాబు”