విజయవాడ:
ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో తీవ్రమైన మలుపు. వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ లీడర్, రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు.
అరెస్ట్‌కు ముందు నోటీసులు జారీ చేసిన పోలీసులు, అనంతరం ఆయనను అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ విషయాన్ని మిథున్ రెడ్డి కుటుంబ సభ్యులకు కూడా సమాచారం అందించారు.
కోర్టులో హాజరు పై నిర్ణయం త్వరలో:
అరెస్ట్ అనంతరం కోర్టులో హాజరుపరిచే అంశంపై నిర్ణయం కొద్ది సేపట్లో తీసుకోనున్నారు. మిథున్ రెడ్డి ప్రస్తుతం లిక్కర్ స్కామ్ కేసులో A4 నిందితుడిగా ఉన్నారు.
SIT ప్రీ-చార్జ్ షీట్ వివరాలు:
300 పేజీల ప్రీ లిమినరీ ఛార్జ్ షీట్ కోర్టుకు సమర్పించిన SIT
100 కి పైగా ఫోరెన్సిక్ రిపోర్టులు
62 కోట్ల రూపాయల ఆస్తులు సీజ్
100+ ఎలక్ట్రానిక్ పరికరాలు స్వాధీనం
268 మంది సాక్షుల వివరాలు
📌 ఆసక్తికరమైన విషయం ఏంటంటే... ఈ ప్రాథమిక ఛార్జ్‌షీట్‌లో మిథున్ రెడ్డి పేరు లేని సంగతి స్పష్టమైంది. కానీ...
రెండో ఛార్జ్ షీట్‌లో మిథున్ రెడ్డి పేరు చేరే అవకాశాలు:
SIT వర్గాల సమాచారం ప్రకారం, మరో 20 రోజుల్లో రెండో ఛార్జ్ షీట్ దాఖలు చేయనున్నట్టు తెలుస్తోంది. ఇందులో మిథున్ రెడ్డి పేరు చేరే అవకాశం ఉందని సర్వత్రా చర్చ.