ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా ఉల్లి రైతుల సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. ఉల్లి రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం ఏ చర్యలు తీసుకోవడం లేదని ఆమె విమర్శించారు.
- ఎకరాకు రూ.1.20 లక్షల పెట్టుబడి పెట్టి పండించిన రైతుకు లాభం కేవలం రూ.3 వేలే దక్కుతోందని షర్మిలా ఆవేదన వ్యక్తం చేశారు.
- ఎకరాకు అక్షరాలా రూ.1.15 లక్షల నష్టం వస్తున్నా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు.
- “ఉల్లి ఎండినా నష్టమే.. ఇప్పుడు పండినా నష్టమే. రైతులు కన్నీళ్లు పెడుతుంటే రాష్ట్రం సుభిక్షంగా ఎలా ఉంటుంది?” అని ప్రశ్నించారు.
- కర్నూల్ మార్కెట్‌లో రైతులకు క్వింటాలుకు రూ.1200 ఇస్తామని చెప్పి, ఒక్క కిలో కూడా మార్క్‌ఫెడ్ సేకరించలేదని దుయ్యబట్టారు.
- మార్కెట్‌లో ఉల్లిని వదిలేసి రైతులు విలవిలలాడుతుంటే, ప్రభుత్వం రైతు పక్షాన నిలబడకపోవడం తీవ్రంగా ఖండించారు.
- “బెనిఫిట్ షోలకు టికెట్ ధర వెయ్యికి పెంచడానికి చూపిన శ్రద్ధ.. రైతుకు గిట్టుబాటు ధర ఇవ్వడంలో ఎక్కడ?” అని ప్రశ్నించారు.
కాంగ్రెస్ పార్టీ తరఫున షర్మిలా కూటమి ప్రభుత్వాన్ని కొన్ని డిమాండ్లు చేశారు:
- మార్క్‌ఫెడ్ ద్వారా వెంటనే క్వింటాలుకు రూ.1200 గిట్టుబాటు ధర అందించాలి.
- కర్నూల్ మార్కెట్‌లో జరుగుతున్న దళారుల మాయాజాలాన్ని అరికట్టాలి.
- అసెంబ్లీలో రైతుల కష్టాలపై ప్రత్యేక చర్చ చేపట్టాలి.